TDP MLAs Protest : అసెంబ్లీలో టీడీపీ ఆందోళన
వాయిదా వేసిన స్పీకర్ సీతారాం
TDP MLAs Protest : ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారంలో ఉన్న వైసీపీ , ప్రతిపక్షంలో ఉన్న తెలుగదేశం పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదలు నెలకొన్నాయి. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
TDP MLAs Protest Viral in Assembly
అసెంబ్లీలో పోడియం వద్ద నిరసన తెలిపారు. ఇదే సమయంలో హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) రెచ్చి పోయారు. ఆయన ఏకంగా తన మీసం తిప్పారు. దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇక్కడ గొడవ చేస్తే సహించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో బాలకృష్ణ , రాంబాబు మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఇద్దరి మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది.
ఇదే సమయంలో అంబటి రాంబాబు తొడగొట్టి రా చూసుకుందాం అని సవాల్ విసిరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బయటకు వస్తే చూసుకుందామంటూ హెచ్చరించారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : BJP Conditions : సోషల్ మీడియా ఆధారంగా ఎంపిక
