Rahul Gandhi Comment : రూట్ మార్చిన రాహుల్

జ‌నంతో మ‌మేకంపైనే ఫోక‌స్

Rahul Gandhi Comment : చాప కింద నీరులా త‌న‌ను తాను నాయ‌కుడిగా ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయ‌న‌కు ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు ప్ర‌ముఖ సామాజిక వేత్త‌, చింత‌నాప‌రుడు యోగేంద్ర యాద‌వ్. మోదీ ప్ర‌భుత్వానికి , దాష్టీకానికి వ్య‌తిరేకంగా నిరంత‌రం గ‌ళం వినిపిస్తూ వ‌చ్చిన రాహుల్ గాంధీ ఉన్న‌ట్టుండి నిరాద‌ర‌ణ‌కు గురైన కోట్లాది మందికి హీరోగా మారాడు. దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూనే , వ‌న‌రుల విధ్వంసాన్ని ప్ర‌శ్నిస్తున్నాడు..మోదీని నిల‌దీస్తున్నాడు. ప్ర‌జా దేవాల‌యంగా భావించే పార్ల‌మెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగాడు. ఇదే స‌మ‌యంలో త‌న‌ను పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురి చేయ‌డంతో మ‌రింత సానుభూతి ఆశించిన దానికంటే ఎక్కువ‌గా ల‌భించింది..ప్ర‌తి చోటా మ‌ద్ద‌తు దొరుకుతోంది.

Rahul Gandhi Comment Viral

త‌న‌ను ప‌ప్పు అని విమ‌ర్శించిన వాళ్లు ఇప్పుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప‌రిణతి చెందిన రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తించారు. ఇదే స‌మ‌యంలో భార‌త దేశానికి రాబోయే కాలంలో అందివ‌చ్చిన నేతగా భావిస్తున్నారు యువ‌త‌. భారీ సెక్యూరిటీని కాద‌నుకుని జ‌నం మ‌ధ్య‌న ఉండేందుకు ఇష్ట ప‌డుతున్నారు. ఇది ఎక్కువ‌గా క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తాను చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రతో ప్ర‌జ‌ల ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే అవ‌కాశం ల‌భించింది. దీనినే ఆయ‌న కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. నిత్యం వార్తాల్లో ఉండేందుకు ఇష్ట ప‌డ‌ని రాహుల్ గాంధీ కేవ‌లం చేత‌ల ద్వారానే వైర‌ల్ గా మారుతున్నారు. ఇది ఒకింత అధికారంలో ఉన్న మోదీకి, ఆయ‌న ప‌రివారానికి ఇబ్బందిగా మారింద‌న‌డంలో సందేహం లేదు.

దేశానికి ఏం కావాల‌నే దానిపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌నకు వ‌చ్చారు రాహుల్ గాంధీ. ఆయ‌న వివిధ వ‌ర్గాల‌ను క‌లుసుకుంటున్నారు. వారు ఏమ‌ని అనుకుంటున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేష‌న్ లో కార్మికుల‌తో భేటీ అయ్యారు. అంతే కాదు ఆయ‌న కూడా రైల్వే కూలీగా మారాడు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా కూలీ వాడే ఎర్ర చొక్కా ధ‌రించాడు. ఇది ఎంద‌రినో ప్ర‌భావితం చేస్తోంది. కార్మికులు రాహుల్ ను క‌ల‌వాల‌ని కోరుకున్నారు. వారి కోరిక మేర‌కు రాహుల్ కూలీల‌తో ములాఖ‌త్ అయ్యారు. అంత‌కు ముందు ఆజాద్ పూర్ లోని మండిని సంద‌ర్శించారు. కూర‌గాయ‌ల అమ్మ‌కందారుల‌తో మాట్లాడారు.

అక్క‌డే ఆగి టీ కొట్టు వ‌ద్ద టీ సేవించాడు. అంత‌కు ముందు హ‌ర్యానా లోని మ‌దీనా ఊరులో రైతుల‌ను క‌లుసుకున్నారు. వారితో క‌లిసి నాట్లు వేశారు. వ‌ర్షం కురుస్తున్నా లెక్క చేయ‌కుండా ట్రాక్ట‌ర్ న‌డిపారు. మోటార్ మెకానిక్ ల‌ను క‌లుసుకున్నాడు. త‌ను కూడా రిపేర్ చేశాడు. క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల సంద‌ర్బంగా డెలివ‌రీ ఏజెంట్ల‌తో సంభాషించాడు. వారితో క‌లిసి కాఫీ సేవించాడు. రోజు రోజుకు రాహుల్ గాంధీ జ‌నంతో మ‌మేకం అవుతూ ప్ర‌జా నాయ‌కుడిగా మారుతున్నారు. రాబోయే కాలంలో ప‌వ‌ర్ లోకి రాక పోయినా జ‌న నేత‌గా గుర్తుండి పోతారు.

Also Read : TSRTC : టీఎస్ఆర్టీసీ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!