Telangana Polls Comment : ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముహూర్తం

తెలంగాణ‌లో షెడ్యూల్ ప్ర‌కార‌మే

Telangana Polls Comment : ఎన్నిక‌ల సంబురం ప్రారంభం కానుంది తెలంగాణ‌లో(Telangana). గ‌త కొంత కాలంగా జ‌రుగుతాయో లేదోన‌న్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి వికాస్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారానికి చెక్ పెడుతూ ఎప్ప‌టి లాగే తెలంగాణ‌లో(Telangana) ఎన్నిక‌లు షెడ్యూల్ (నిర్దేశించిన తేదీ) ప్రకారం నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి క‌స‌ర‌త్తు ప్రారంభించింది ఈసీ. అయితే ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు జ‌ర‌గే ఛాన్స్ లేదంటూ బాంబు పేల్చారు కేటీఆర్. కానీ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఉట్టివే అని తేలి పోయింది. తాము పొలిటిక‌ల్ లీడ‌ర్ల నిర్ణ‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ప్ర‌స‌క్తి లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు సిఈవో.

Telangana Polls Comment Viral

ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీతో పాటు కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీ, బీఎస్పీ, త‌దిత‌ర పార్టీలు కొలువుతీరి ఉన్నాయి. అన్ని పార్టీల‌కంటే ముందంజ‌లో కొన‌సాగుతోంది బీఆర్ఎస్. ముచ్చ‌ట‌గా మూడోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. అదే ప‌నిలో బిజీగా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ముంద‌స్తుగా ఊహించ‌ని రీతిలో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు బీఆర్ఎస్ బాస్. ఆయా స్థానాల‌లో ఎక్కువ మంది సిట్టింగ్ ల‌నే ఖ‌రారు చేశారు. ఇది మిగ‌తా ప్ర‌తిప‌క్షాల‌ను విస్తు పోయేలా చేసింది. కేసీఆర్ ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉండాల‌ని అనుకుంటాడు. ల‌క్ష‌లాది మంది స‌భ్య‌త్వం క‌లిగిన పార్టీగా బీఆర్ఎస్ ఉంది. సంస్థాగ‌త నిర్మాణం మ‌రింత బ‌లంగా ఉండ‌డంతో కేసీఆర్ కు, ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాల‌కు ఎదురే లేకుండా పోయింది. మొత్తం స్థానాల‌లో 115 మందిని ప్ర‌క‌టించారు. ఇందులో ఏడుగురికి మొండి చేయి చూపించారు. వారికి ఏదో ర‌కంగా స‌ర్దుబాటు చేస్తాన‌ని వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే కేసీఆర్ ఎన్నిక‌లకు సిద్దంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఇక రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీకి పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఎలాగైనా స‌రే ప‌వ‌ర్ లోకి రావాల‌ని వ్యూహాలు ప‌న్న‌డంలో నిమ‌గ్న‌మ‌య్యాయి బీజేపీ, కాంగ్రెస్. పోటాపోటీగా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించే ప‌నిలో ప‌డ్డాయి. ఇటీవ‌ల తుక్కుగూడ‌లో విజ‌య భేరి స‌భ‌ను నిర్వ‌హించింది కాంగ్రెస్. అధికార పార్టీ జ‌డుసుకునేలా జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. మ‌రో వైపు అక్టోబ‌ర్ 2న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ , జ‌న‌గాం జిల్లాల్లో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను ఏర్పాటు చేసింది. దీనికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వ‌స్తున్నారు. మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సారథ్యంలోని బీఎస్పీ కూడా గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావాన్ని చూపే ఛాన్స్ ఉంది. ఇక ఎంఐఎం ఈసారి స‌త్తా చాటాల‌ని చూస్తోంది ఆ పార్టీ ప్ర‌స్తుతం గులాబీతో క‌లిసి ప‌రుగులు తీస్తోంది. ఏది ఏమైనా ముంద‌స్తుగానే ఎన్నిక‌లు రానుండ‌డంతో ఇక ఆయా పార్టీలకు గెల‌వ‌డం స‌వాల్ గా మారింది.

Also Read : Kodali Nani : చంద్ర‌బాబు కుప్పంలో గెల‌వ‌డు

Leave A Reply

Your Email Id will not be published!