Seeman Satya Raj : తమిళనాడు – నామ్ తమిళార్ పార్టీ చీఫ్ సెంథమిజన్ సీమాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణాటక సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు సత్య రాజ్ పై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇవాళ ప్రజా కళాకారుడు సత్యరాజ్ పుట్టిన రోజు. ఆయనకు శుభాభినందనలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు సీమాన్(Seeman). సినీ వెండి తెరపై అద్భుతమైన నటుడే కాదని హృదయం ఉన్న మనిషి అని కొనియాడారు. తమిళులు ఎక్కడ బాధ పడినా తమిళుల పక్షాన నిలబడ్డారని ప్రశంసించారు సీమాన్.
Seeman Satya Raj Comment
సాటి లేని స్క్రీన్ ఆర్టిస్ట్. ప్రగతి శీల ఆలోచనా పరుడు. తాను కన్నడ సినీ పరిశ్రమకు చెందినా ప్రతి కళాకారుడికి స్వేచ్ఛ ఉండాలని కోరిన అరుదైన నటుడు సత్యరాజ్ అని పేర్కొన్నారు సీమాన్. తమిళుల హక్కుల కోసం గళం విప్పిన విప్లవ కారుడు సత్యరాజ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు .
సత్య రాజ్ ను నేను సోదరుడిగా భావిస్తాను. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపు కోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు సీమాన్. రియలిస్టిక్ నటనతో సామాన్యులను సులువుగా ఆకట్టుకునే గొప్ప కళాకారుడు సత్యరాజ్ అని అన్నారు.
Also Read : TDP Slams : బండారు అరెస్ట్ దారుణం