Minister KTR : ఎత్తిపోతల పథకం రైతులకు అంకితం
నెరవేరిన దశాబ్దాల నిర్మల్ వాసుల కల
Minister KTR : నిర్మల్ జిల్లా – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో దశాబ్దాల నిర్మల్ జిల్లా వాసుల కల సీఎం కేసీఆర్ ప్రయత్నంతో నెరవేరిందని అన్నారు కేటీఆర్. బుధవారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఎత్తిపోతల పథకాన్ని రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి.
Minister KTR Comment
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ. 741 కోట్ల ఖర్చుతో 27 ప్యాకేజ్ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని 99 గ్రామాలకు చెందిన 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు లక్ష్మీ నరసింహ్మ స్వామి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు కేటీఆర్(Minister KTR), అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రైతుల సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు కేటీఆర్.
ఇవళ యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత సుభిక్షంగా మారడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : Harish Rao : రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయం
