Home Minister Slaps Comment : మంత్రినా మ‌జాకా

మంత్రి నిర్వాకం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

Home Minister Slaps Comment : తెలంగాణ‌లో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వం లో ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు నాలుగు కోట్ల ప్ర‌జానీకం త‌ల దించుకునేలా ఉంటోంది. స‌భ్య స‌మాజానికి ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల్సిన మంత్రులు స్థాయిని మ‌రిచి చేయి చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పాల‌కుడిని బ‌ట్టే మంత్రుల వ్య‌వ‌హార శైలి ఉంటుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

గ‌తంలో ఎంద‌రో మంత్రులుగా కొలువు తీరారు. ఆద‌ర్శ ప్రాయంగా నిలిచిన వారున్నారు. కానీ ఎప్పుడైతే కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉన్న‌ది. త‌మ‌కు ఎదురు తిరిగిన వారిని, ప్ర‌శ్నించిన వాళ్ల‌ను, నిల‌దీసిన వాళ్ల‌ను ట్రోల్ చేయ‌డం, తెలంగాణ వ్య‌తిరేకులుగా ముద్ర వేయ‌డం ప‌రిపాటిగా మారింది. 10 ఏళ్ల‌వుతోంది బీఆర్ఎస్ కొలువు తీరి. కల్వ‌కుంట్ల కుటుంబ ఆధీనంలో కొన‌సాగుతున్న ఈ పాల‌న ప్ర‌జ‌ల‌కు శాపంగా మారింద‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు.

Home Minister Slaps Comment Viral

ఆయ‌న సాక్షాత్తు రాష్ట్రంలో కీల‌క‌మైన ప‌ద‌విలో ఉన్న నాయ‌కుడు. పైగా మైనార్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ఇంకేం హోం శాఖ త‌న చేతిలో ఉంద‌ని అనుకున్నారో ఏమో మ‌హ‌మూద్ అలీ(Mahmood Ali) రెచ్చి పోయారు. అదుపు త‌ప్పారు. ఆపై త‌న‌కు అంగ ర‌క్ష‌కుడిగా ఉన్న గ‌న్ మెన్ పై సోయి లేకుండా చెంప ఛెళ్లు మ‌నిపించారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇవాళ త‌న‌ను కంటికి రెప్ప‌లా చూసుకుంటూ వ‌స్తున్న గ‌న్ మెన్ పై అంద‌రూ చూస్తూ ఉండ‌గానే దాడికి పాల్ప‌డితే రేపు సామాన్యుల‌కు ర‌క్ష‌ణ ఎలా ఉంటుంద‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. ఇక సామాజిక మాధ్య‌మాల‌లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌రిస్థితి ఇంత‌కంటే దారుణంగా ఉంది.

అధికార పార్టీకి ఎవ‌రు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించినా , మాట్లాడినా మ‌రుస‌టి రోజే పోలీస్ కేసులు, వేధింపులు, లేక పోతే దాడుల‌కు పాల్ప‌డ‌డం ష‌రా మామూలై పోయింది. మొత్తంగా ఆనాడు ర‌జాక‌ర్ల దాష్టీకాలు, దౌర్జ‌న్యాలను చూసిన తెలంగాణ ఇప్పుడు క‌ళ్లారా మ‌రోసారి గులాబీ దండు పాళెం దాడుల‌ను చ‌వి చూస్తోంది. కొస మెరుపు ఏమిటంటే తాను కావాల‌ని దాడి చేయ‌లేద‌ని, త‌న‌కు కొడుకు లాంటి వాడ‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ. ఇలాంటి వాళ్ల‌ను కేబినెట్ లో కొన‌సాగిస్తూ వ‌స్తున్న సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. రేపు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారో యువ రాజా వారు సెల‌విస్తారో వేచి చూడాలి.

Also Read : Meenakshi Lekhi : భార‌తీయుల‌ను క్షేమంగా తీసుకొస్తాం

Leave A Reply

Your Email Id will not be published!