Eatala Rajender : సిద్దిపేట జిల్లా – మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఇంకెన్ని హామీలు ఇచ్చినా సీఎం ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోరు పెంచారు ఈటల(Eatala Rajender). గజ్వేల్ ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కమలం కండువా కప్పుకున్నారు.
Eatala Rajender Comments on KCR
ఈ సందర్బంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలను ప్రస్తావించారు. 10 ఏళ్లుగా గుర్తుకు రాని సర్పంచ్ లు, కార్యకర్తలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ప్రస్తావించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.
కేసీఆర్ తాను కొల్లగొట్టిన ప్రజా ధనంతో గెలుస్తానని అనుకుంటున్నాడని కానీ అంత సీన్ లేదన్నారు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని, తనను ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. మన వైపు ధర్మం ఉందన్నారు. రెట్టింపు శక్తితో కొట్లాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్.
నేను ఏనాడో సీఎం గురించి చెప్పానని, ఆయన ప్రజలకు సేవకుడు మాత్రమేనని ఓనర్ కాదన్నారు. పోరాటాల చరిత్ర , ప్రశ్నించే తత్వం కలిగిన చరిత్ర నాదన్నారు . తెలంగాణ ప్రజలకు కాపలా కాసే బిడ్డను కూడా నేనని పేర్కొన్నారు.
Also Read : TTD Rush : పుణ్య క్షేత్రం భక్తుల సందోహం