CM KCR : గులాబీదే విజయం తథ్యం
తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR : చెన్నూరు – ఆనాడు తాను గనుక పోరాటం చేయక పోయి ఉంటే ఈనాడు తెలంగాణ వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్(CM KCR). ఇవాళ అభివృద్దికి అక్రమార్కులకు మధ్య పోరు కొనసాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బాగంగా చెన్నూరులో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR Comment
గులాబీ జెండా ఎగురడం ఖాయమని జోష్యం చెప్పారు కేసీఆర్. ఓటు అంటే ఆశామాషి కాదన్నారు. అది వజ్రాయుధమని , ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అభ్యర్థులు ఎవరో ముందు తెలుసుకోండి. ఎవరు మీ వైపు , మీకోసం ఆలోచిస్తారో చూసి మద్దతు ఇవ్వాలని కోరారు.
10 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ది తెలంగాణలో జరిగిందని చెప్పారు కేసీఆర్. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఇవాళ హైదరాబాద్ దేశానికే తల మానికంగా నిలిచిందన్నారు.
ఒకప్పుడు ఐటీ అంటే సిటీ అనే వాళ్లని కానీ ప్రస్తుతం ఇతర నగరాలు, జిల్లాలకు కూడా విస్తరించడం జరిగిందన్నారు. ఇదంతా బీఆర్ఎస్ సర్కార్ వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఎన్నికలలో సోయి లేనోళ్లు ఎన్నో హామీలతో ముందుకు వస్తారని వారిని నమ్మితో ఇక భవిష్యత్తు అంధకారమేనని హెచ్చరించారు.
Also Read : Bellaiah Naik : గాంధీ భవన్ లో బెలయ్య నాయక్ దీక్ష