Astrotalk CEO : భారత్ కప్ గెలిస్తే రూ. 100 కోట్లు
పంచుతానంటున్న ఆస్ట్రోటాక్ సిఇఓ
Astrotalk CEO : న్యూఢిల్లీ – భారత దేశంలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ ఇంకే ఏ ఆటకు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆస్ట్రోటాక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంచలన ప్రకటన చేశాడు. ఒకవేళ భారత జట్టు గనుక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిస్తే తమ కంపెనీ తరపున రూ. 100 కోట్లు పంచుతానంటూ సంచలన ప్రకటన చేశాడు.
Astrotalk CEO Comments Viral
ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ లలో రెండు సార్లు భారత జట్టు గెలుపొందింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా తొలిసారి కప్ కైవసం చేసుకుంది. ఇక 2012లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు కప్ గెలుచుకుంది.
తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ మోతేరా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతోంది. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. యావత్ దేశ వ్యాప్తంగా క్రికెట్ అసోసియేషన్ లు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి.
భారత జట్టు గెలవాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు . ఇప్పటికే కోట్లాది మంది ఈ మ్యాచ్ ను తిలకిస్తున్నారు. ఇరు జట్ల మధ్య బిగ్ ఫైట్ కొనసాగుతోంది. మొత్తంగా నువ్వా నేనా అన్న రీతిలో జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలని కోరుకుందాం.
Also Read : Rahul Gandhi : ఇందిర అడుగు దేశానికి ముందడుగు
