Travis Head : బెంబేలెత్తించిన ట్రావిస్ హెడ్
భారత జట్టుకు బిగ్ షాక్
Travis Head : అహ్మదాబాద్ – ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎలా ఉంటారో ఆసిస్ ఆటగాళ్లను చూసి నేర్చుకోవాలి. వరుస విజయాలతో తమకు ఎదురే లేదని అనుకుంటూ హ్యాపీ మూడ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లకు బిగ్ షాక్ ఇచ్చాడు ఆసిస్ రూపంలో మైదానంలోకి వచ్చిన ట్రావిస్ హెడ్(Travis Head). ఒకానొక దశలో 3 వికెట్లు కోల్పోయి ఇక కష్టమేమోనన్న తరుణంలో ఉన్నట్టుండి మెరుపు వీరుడిలా వచ్చాడు. ఎక్కడా తడబడలేదు. మైదానం అంతటా అద్బుతమైన షాట్స్ తో అలరించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు ఆసిస్ క్రికెటర్ ట్రావిస్ హెడ్.
Travis Head Sensational Innings
టోర్నీలో అద్భుమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న షమీ, బుమ్రా, సిరాజ్ , జడేజా ఏ మాత్రం ప్రభావం చూపించ లేక పోయారు. మ్యాచ్ కు ముందే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సగం దెబ్బ కొట్టాడు. లక్షా 30 వేల మంది అభిమానులను నిశ్శబ్దంగా ఉంచడం కంటే పెద్ద సంతృప్తి ఇంకేముంటుంది అని ప్రకటించాడు. బహుశా తను అన్నట్టే జరిగింది. ఆసిస్ రెచ్చి పోయింది.
ఇటు బౌలింగ్ లో అటు ఫీల్డింగ్ లో భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేపట్టింది. కనీసం 100 పరుగులు కేవలం ఫీల్డింగ్ ద్వారానే ఆపారంటే నమ్మగలమా. చివరి దాకా గెలుపు వాకిట్లోకి తీసుకు వచ్చిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. ఒకరు లబూషేన్ ఇంకొకరు ట్రావిస్ హెడ్. 137 రన్స్ చేశాడు. లబూషేన్ 58 పరుగులతో రాణించాడు. మొత్తంగా హెడ్ అంటే ఏమిటో చూపించాడు భారత్ కు.
Also Read : Kapil Dev : కపిల్ దేవ్ ను అవమానించిన బీసీసీఐ