Rohit Sharma : అహ్మదాబాద్ – ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ కాటు నుంచి ఇంకా కోలుకునేందుకు సమయం పడుతోంది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు ఈ టోర్నీలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది. ఏకంగా 10 మ్యాచ్ లు వరుసగా గెలిచింది. తనకు ఎదురే లేదని అనుకుంది. కానీ ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు రూపంలో పరాజయం మూటగట్టుకుంది.
Rohit Sharma Emotional
అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో లక్షా 20 వేల మందికి పైగా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు. సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ప్రధాని డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్ సైతం ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
కానీ తీవ్రమైన ఒత్తిడికి భారత జట్టు లోనైంది. ఆ విషయం ప్రతి దానిలోనూ కనిపించింది. ఇక ప్రత్యర్థి జట్టు మానసికంగా ముందే దెబ్బ కొట్టింది. లక్షలాది మంది అరుపులను మూసి వేయాలంటే మేం గెలవాల్సి ఉంటుందన్నాడు పాట్ కమిన్స్.
ఇంకేం అనుకున్నట్టుగానే టాస్ గెలిచాడు. ఇండియాను దెబ్బ కొట్టాడు. ఆడుతారని అనుకున్న వాళ్లంతా చేతులెత్తేశారు. ఇక బౌలింగ్ పరంగా కూడా ఆశించిన మేర రాలేదు. మొత్తంగా అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో దుమ్ము రేపారు ఆసిస్ ఆటగాళ్లు. మొత్తంగా రోహిత్ శర్మ తో పాటు ఇతర ఆటగాళ్లు కంట తడి పెట్టడం ఒకింత విస్తు పోయేలా చేసింది.
Also Read : Pat Commins : కమిన్స్ కామెంట్స్ కలకలం