Gujarat Titans Skipper : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవరో
రశీద్ ఖాన్..గిల్..కేన్ విలియమ్సన్
Gujarat Titans : ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యానికి కోలుకోలేని షాక్ తగిలింది. భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఉన్నట్టుండి వదులుకుంది. ఆయా జట్ల మధ్య ఉన్న ఒప్పందం మేరకు తను జట్టు నుంచి రిలీవ్ అయ్యాడు. ఇది ఒక రకంగా పెద్ద దెబ్బే.
Gujarat Titans Skipper Issue
తన సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ తొలిసారిగా ఎంట్రీ ఇవ్వడంతోనే ఐపీఎల్ కప్ ను చేజిక్కించుకుంది. ఇది ఓ రికార్డ్. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీలో రన్నరప్ గా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ లో ఓటమి పాలైంది గుజరాత్ టైటాన్స్.
ఈ జట్టుకు మెంటార్ గా ఉన్నాడు ఆశిష్ నెహ్రా. అయితే పాండ్యాకు కోచ్ కు పడడం లేదని, అందుకే ముంబై ఇండియన్స్ టీమ్ కు జంప్ అయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది. పాండ్యా జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు ఎవరు సారథిగా ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. మరి మేనేజ్ మెంట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఆ ముగ్గురిలో రషీద్ ఖాన్ , కేన్ విలియమ్సన్ , శుభ్ మన్ గిల్ ఉన్నారు.
Also Read : Congress Slams : కారు పంక్చర్ ఖాయం – కాంగ్రెస్