CM KCR : కాంగ్రెసోళ్లు ద‌ద్ద‌మ్మ‌లు – కేసీఆర్

వాళ్లు వ‌స్తే రాష్ట్రం చీకటే

CM KCR : సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. మాయ మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు రెడీ అయ్యిందంటూ ఆరోపించారు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సంగారెడ్డి లో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో ప్రసంగించారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

CM KCR Comments on Congress Leaders

ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇస్తూ బ‌లుపు చూసి వాపు అనుకుంటోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఆరు నూరైనా స‌రే 119 సీట్ల‌కు గాను 100 సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు సీఎం కేసీఆర్(CM KCR). సంగారెడ్డిలోని ప్ర‌తి గ‌ల్లీని తాను తిరిగాన‌ని గుర్తు చేశారు.

ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చేందుకు పాద‌యాత్ర చేశాన‌ని అన్నారు. ఈ విష‌యం ప్ర‌తి ఒక్క‌రికి తెలుస‌న్నారు కేసీఆర్. చింతా ప్ర‌భాక‌ర్ ఓడి పోయినా నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాడ‌ని , ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తూ వ‌చ్చాడ‌ని ఈసారి ఆయ‌న‌ను ఓటు వేసి ఆశీర్వ‌దించాల‌ని పిలుపునిచ్చారు సీఎం.

నియోజ‌క‌వ‌ర్గం కోసం ప‌నులు అడిగి చేయించు కున్నాడ‌ని , మెడిక‌ల్ కాలేజీతో పాటు 450 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు. దాని నిర్మాణం జ‌రుగుతోంద‌న్నారు. సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌గ్ర అభివృద్ది జ‌ర‌గాలంటే ఇక్క‌డ బీఆర్ఎస్ గెల‌వాల‌న్నారు.

Also Read : Revanth Reddy : రైతు ‘బంద్’ కు మామా అల్లుడే కార‌ణం

Leave A Reply

Your Email Id will not be published!