Chiranjeevi Vote : ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి

ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయాలి

Chiranjeevi : హైద‌రాబాద్ – మాజీ కేంద్ర మంత్రి , ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురువారం త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆయ‌న సామాన్యుడి లాగ‌నే లైన్ లో నిల్చున్నారు. త‌న‌తో పాటు భార్య సురేఖ‌, కూతురు తో క‌లిసి ఓటు వేసేందుకు వచ్చారు. స్వేచ్ఛ‌గా ఓటు వినియోగించు కోవాల‌ని, విలువైన ఓటు మ‌న భ‌విత‌వ్యాన్ని మార్చుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Chiranjeevi Vote Completed

తాను ఓటు వేయ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఇది మ‌నంద‌రి బాధ్య‌త కావాల‌న్నారు. సెల‌వు ఉంది క‌దా అని ఎవ‌రూ ఇంటి వ‌ద్ద‌నే ఉండ‌కుండా బ‌య‌ట‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వాల‌ను మార్చే స‌త్తా , ఏర్పాటు చేసే ఆయుధం ఈ ఓటు అని పేర్కొన్నారు.

సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, జూనియ‌ర్ ఆర్టిస్టులు సైతం ఓటు వేసేందుకు బారులు తీరారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం 5 గంట‌ల దాకా జ‌రుగుతుంది. ఇక స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌లో సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది.

Also Read : Revanth Reddy : బీఆర్ఎస్ ప‌త‌నం కాంగ్రెస్ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!