CM Revanth Reddy : హైదరాబాద్ అభివృద్దిపై రేవంత్ ఫోకస్
సచివాలయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమీక్ష
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే పలు కీలక శాఖలపై సమీక్ష చేపట్టారు. తాజాగా సచివాలయంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నగర అభివృద్దిపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సూచనలు చేయాల్సిందిగా సూచించారు. నిన్నటి దాకా తనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసినా పట్టించు కోలేదు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Focus on Hyderabad
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఆయనను ప్రొటెం స్పీకర్ గా నియమించారు సీఎం . దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది బీజేపీ. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి రాలేదు.
దీనిని పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి. ఎంఐఎంకు ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. రాష్ట్ర, నగర అభివృద్దికి అన్ని పార్టీల సహాయ సహకారాలు తీసుకుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఉపాధి, ఆర్థిక అభివృద్ది ప్రాంతంగా మూసీ పరీవాహకం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజ నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయాలని సూచించారు.
మూసీ నది వెంట వంతెనలు, వాణిజ్య దుకాణాల సముదాయం, అమ్యూజ్ మెంట్ పార్కుల్, హాకర్ జోన్ లు, పాత్ వేలను , ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించే విధంగా ప్లాన్ లు తయారు చేయాలని స్పష్టం చేశారు సీఎం.
Also Read : TTD EO Dharma Reddy : టీటీడీ వెబ్‌సైట్ ఆధునీకరణ