CM Revanth Reddy : అసెంబ్లీ పార్లమెంట్ లాగా ఉండాలి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
CM Revanth Reddy : హైదరాబాద్ – పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ హోరెత్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలనాకి తెర తీశారు. బుధవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఇదే సమయంలో డిసెంబర్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నూతన స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేశారు.
CM Revanth Reddy Comment
ఇవాళ ఆయనతో నామినేషన్ దాఖలు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. స్పీకర్ ఎన్నిక విషయంలో ఎంఐఎం సభ్యులు కూడా సహకరించాలని కోరారు. ఈ మేరకు ముందస్తుగానే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేశారు.
అసెంబ్లీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసన సభ పార్లమెంట్ మాదిరిగా ఉండాలని ఆదేశించారు. త్వరలో రూపు రేఖలు మార్చాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. వచ్చే శాసన సభ , మండలి సమావేశాల లోపు వీటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ, శాసన మండలి ఒకే లాగా ఉండేలా కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. పార్లమెంట్ ను దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని స్పష్టం చేశారు సీఎం. పార్లమెంట్ వద్ద విజయ్ చౌక్ మాదిరిగా మార్పులు చేయాలని ఆదేశించారు.
Also Read : AP High Court : టీఎంసీకి టీటీడీ నిధులు వద్దు