Revanth Reddy Review : సీఎం సమీక్ష ఆరోగ్య శాఖపై ఆరా
హాజరైన దామోదర రాజనర్సింహా
Revanth Reddy : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేబినెట్ లో కొలువు తీరిన మంత్రులకు సంబంధించి శాఖలు కేటాయించారు. ఎవరికి వారు తమ తమ శాఖలను రివ్యూ చేస్తున్నారు. దీనికి కీలకంగా మారారు రేవంత్ రెడ్డి. ఆయన గతంలో కొలువు తీరిన కేసీఆర్ కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నూతన సీఎం పాలనా పరంగా దూకుడు పెంచారు.
Revanth Reddy Review on Health Department
ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను విస్తు పోయేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి దామోదర రాజ నరసింహా హాజరయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా కూడా పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖల పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సీఎం. గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు బాధితులకు అండగా ఉండాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యల గురించి పూర్తి నివేదిక అందజేయాలని సీఎం ఆదేశించారు.
Also Read : Muslim Religious Leaders : సీఎంకు మత పెద్దల సన్మానం