Anurag Thakur : పారా గేమ్స్ పారా హుషార్
అనురాగ్ ఠాకూర్ కామెంట్
Anurag Thakur : న్యూఢిల్లీ – ఆసియా పారా గేమ్స్ లో హర్యానా క్రీడాకారులు అద్భ/తమైన ప్రతిభ కనబర్చడం ఆనందంగా ఉందన్నారు కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ఇదిలా ఉండగా హర్యానా ఒక్కటే 40 స్వర్ణాలు, 39 రజతాలు, 26 కాంస్య పతకాలతో 105 పతకాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ 25 స్వర్ణాలు, 23 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 62 పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది.
Anurag Thakur Comment about Sports
ఇక తమిళనాడు రాష్ట్రం పారా గేమ్స్ లలో మూడో స్థానంతో సరి పెట్టుకుంది. 20 బంగారు పతకాలు, 8 రజతాలు, 14 కాంస్య పతకాలతో నిలిచింది. ఈ పారా గేమ్స్ చైనాలోని హాంగ్ జౌలో ఆసియా పారా గేమ్స్ జరిగాయి.
చేతులు లేని ఆర్చర్ శీతల్ దేవి, డిస్కస్ త్రోయర్ యోగేష్ కథునియా, టేబుల్ టెన్నిస్ స్టార్ భవినా పటేల్, పరుల్ పర్మార్, నిషాద్ కుమార్ వంటి అనేక మంది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రతిభా పాటవాలను కనబర్చిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు మంత్రి అనురాగ్ ఠాకూర్.
తమిళనాడుకు చెందిన రాజేష్ టి, హర్యానాకు చెందిన సందీప్ డాంగి, మహారాష్ట్రకు చెందిన తులికా జాధావో, అస్సాంకు చెందిన అష్మిత తమ ప్రతిభతో ఆకట్టుకున్నారని అన్నారు అనురాగ్ టాకూర్.
Also Read : Nara Lokesh : జనానికి దిక్కేది అభివద్దికి దారేది