Harish Rao : రైతు బిడ్డకు హరీశ్ రావు కంగ్రాట్స్
బిగ్ బాస్ విజేతగా సిద్దిపేట బిడ్డ
Harish Rao : హైదరాబాద్ – ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 విజేతగా నిలిచాడు తెలంగాణ ప్రాంతంలోని సిద్దిపేట కు చెందిన పల్లవి ప్రశాంత్ . తను రైతు కుటుంబానికి చెందిన వారు. సామాన్యులు కూడా విజేతలుగా నిలుస్తారని రైతు బిడ్డ నిరూపించాడని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Harish Rao Appreciates Pallavi Prashanth
ఇందులో భాగంగా సోమవారం ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు విజేత పల్లవి ప్రశాంత్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. తను విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉందన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతానికి చెందిన వాడు కావడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు. విచిత్రం ఏమిటంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ ప్రోగ్రామ్ లోకి వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ఇదే సమయంలో ఎంట్రీ ఇచ్చినప్పుడు బియ్యం సంచితో వెళ్లడం విస్తు పోయేలా చేసింది.
పల్లవి ప్రశాంత్ రైతు ఇంటి పేరుగా మారి పోయిందని, ఇలా ప్రాచుర్యం రావడానికి ప్రధాన కారకుడు బిగ్ బాస్ విజేతనేనని పేర్కొన్నారు మాజీ మంత్రి. పొలాల నుండి బిగ్ బాస్ హౌస్ దాకా తను సాగించిన ప్రయాణం ఎంతో ఆసక్తిని రేపిందని తెలిపారు తన్నీరు హరీశ్ రావు.
Also Read : Pawan Kalyan : సీట్ల పంపకంపై బాబు..పవన్ ఫోకస్