Rachin Ravindra : ధోనీ చెంతకు రచిన్ రవీంద్ర
రూ. 1.80 కోట్లకు సీఎస్కే కైవసం
Rachin Ravindra : దుబాయ్ – బీసీసీఐ ఆధ్వర్యంలో భారత్ లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో మోస్ట్ పాపులర్ హీరోగా పేరు పొందాడు న్యూజిలాండ్ కు చెందిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర(Rachin Ravindra). తాజాగా దుబాయ్ వేదికగా బీసీసీఐ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది 2024లో జరిగే ఐపీఎల్ కు సంబంధించి వేలం పాట కొనసాగింది.
Rachin Ravindra with Dhoni
ఇందులో భాగంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్. కావ్య మారన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఒక ఆటగాడిని తీసుకోవడం విస్తు పోయేలా చేసింది.
ఇక ఝార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఊహించని రీతిలో కీవీస్ స్టార్ రచిన్ రవింద్రను చేజిక్కించుకుంది. తను రూ. 50 లక్షల బేస్ రేట్ కు వేలం పాటలోకి వచ్చాడు.
తీరా అతడిని చేజిక్కించు కునేందుకు పలు జట్ల మేనేజ్ మెంట్లు పోటీ పడ్డాయి. కానీ చివరకు రూ. 1.80 కోట్లకు చెన్నై యాజమాన్యం కైవసం చేసుకుంది. దీంతో ధోనీ చెంతకు చేరినట్లయింది రవీంద్ర.
Also Read : Pat Commins IPL : భారీ ధరకు ప్యాట్ కమిన్స్