Amit Shah : హైదరాబాద్ – బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు.
Amit Shah Confirms
రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 17 సీట్లను కైవసం చేసుకునేలా ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లతో పాటు గణనీయంగా ఓటు శాతం పెరగడంతో ఆ పార్టీ జోష్ లో ఉంది.
ఇదిలా ఉండగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అమిత్ చంద్ర షా(Amit Shah). ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న నలుగురు ఎంపీలకు తిరిగి సీట్లను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. మిగతా 13 సీట్లలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మధ్య దూరం పెరిగిందని, వ్యక్తిగత ఆధిపత్య పోరు వల్లనే పార్టీకి తీరని నష్టం జరిగిందని ఈ సందర్బంగా ప్రస్తావించినట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ కావద్దంటూ హెచ్చరించినట్లు సమాచారం.
అంతకు ముందు హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు అమిత్ చంద్ర షా.
Also Read : Ram Gopal Varma : ఆర్జీవీ ఫిర్యాదు కలకలం