Chiranjeevi : బ్రహ్మానందం జీవితానుభవం ప్రశంసనీయం
ప్రశంసనీయమన్న చిరంజీవి
Chiranjeevi : హైదరాబాద్ – తెలుగు సినీ చరిత్రలో చెరపలేని అధ్యాయం బ్రహ్మానందం. హాస్య నటుడిగా, రచయితగా, చిత్రకారుడిగా, శిల్పకారుడిగా , వక్తగా ఇలా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేశారు ఈ అరుదైన నట దిగ్గజం. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు మరెన్నో పురస్కారాలను అందుకున్నారు.
Chiranjeevi Praises Brahmanandam
తాజాగా ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకునే ప్రయత్నం చేశారు నేను అనే పుస్తకంలో. ఒక రకంగా ఇది డిక్షనరీ లాంటిదని చెప్పవచ్చు. ఇందులో తాను కలుసుకున్న వ్యక్తుల గురించి, తెలుసుకున్న విషయాలు, దృష్టి కోణాలు, తనకు ఎదురైన సవాళ్లను రంగరించి , క్రోడీకరించి ఆత్మ కథగా నేను అనే పేరుతో పుస్తకాన్ని రాశారు.
ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బ్రహ్మానందం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయనను శాలువాతో సత్కరించారు. కొన్నేళ్లుగా తనతో నేను ప్రయాణం చేస్తూ వస్తున్నాను. సమయోచితంగా ఎలా మాట్లాడాలో , ఎలా మెప్పించాలో , ఎలా నవ్వులు పూయించాలో తనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదని కితాబు ఇచ్చారు మెగాస్టార్.
తాను చెప్పినట్టు ఒకరి అనుభవం మరొకరికి పాఠంగా మారొచ్చు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని సూచించారు చిరంజీవి. పుస్తకాన్ని ప్రచురించిన అన్వీక్షికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Also Read : Jogi Ramesh : పవన్ ..బాబుకు జోగి సవాల్