Anganwadis Protest : ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామంటున్న అంగన్వాడీలు
Anganwadis Protest : ఏపీలో జరుగుతున్నా అంగన్వాడీల ధర్నాలు రాస్తారోకోలు ముమారానికి సాగుతున్నాయి. అంగన్వాడీలు(Anganwadi) వేతనాల పెంపుకోసం నిరసనలు హోరెత్తుతున్నాయ్. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడితో ఆందోళన మరింత వేడెక్కుతున్నాయి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళనలు ఉద్రక్తం చేస్తామంటున్నారు అంగన్వాడీలు ఆశ వర్కర్లు.
Anganwadis Protest Viral
మరోవైపు ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఏడవరోజుకు చేరుకుంది కనీస వేతనం 26000/- రూపాయలు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టడంతో ఎక్కడికి అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయేంది. చెత్త తొలగింపు కోసం అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులు ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్నారు పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రభుత్వం దీనిపై స్పందించి ఏపీలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ అలవెన్సు ప్రకటించింది మున్సిపల్ శాఖలో మరికొన్ని కేటగిరీల పారిశుధ్య కార్మికులకు ఒక్క్యూపెషనల్ హెల్త్ అలవెన్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్లకు ఒక్క్యూపెషనల్ హెల్త్ అలవెన్సు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీ లక్ష్మి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు శానిటేషన్ వాహనాల డ్రైవర్లు మలేరియా వర్కర్లకు హెల్త్ అలవెన్సు వర్తిస్తుంది.
ప్రభుత్వం నుంచి దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఆందోళన సెగ మాత్రం ఇంకా చల్లారలేదు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటున్నారు అంగన్వాడీ వర్కర్లు .. ఆశ వర్కర్లు.
Also Read : Earthquakes in Japan : జపాన్ను వణికిస్తున్న వరుస భూకంపాలు