YS Sharmila Invites : కుమారుడి నిశ్చతార్దానికి తన అన్నని ఆహ్వానించిన షర్మిల

వైఎస్ షర్మిల చాలా రోజుల తర్వాత తన అన్నని కలిశారు

YS Sharmila : చాలా రోజుల తర్వాత మనం అన్న చెల్లెళ్ళ కలయికను చూస్తున్నాం తాడేపల్లిలో జగన్ ఇంటికి వైయస్ షర్మిల వెళ్లారు. తన కుమారుడు, కాబోయే కోడలితో షర్మిల అన్నని కలవడానికి వెళ్లారు. నిశ్చతార్థం మరియు పెళ్ళికి ఆహ్వానించారు షర్మిల. ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె కారుని ఆపేసారు తాడేపల్లి సెక్యూరిటీ సిబ్బంది.

YS Sharmila Met her Brother

కాన్వాయితో పాటు లోపలికి వచ్చే ప్రయత్నం చేయడంతో ఆలస్యం అవ్వడం వల్ల ఆపడం జరిగిందని చెప్పారు సెక్యూరిటీ. అయితే కాసేపటికి లోనికి అనుమతించారు సెక్యూరిటీ సిబ్బంది.

ఈ నేపథ్యంలో పొలిటికల్ గా కొన్ని ప్రశ్నలు సంధించారు విలేకర్లు, అయితే దీనికి షర్మిల(YS Sharmila) రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఆర్కె చెప్పుకొచ్చారు . ఆమె చేరిన తరవాత తాను కూడా కాంగ్రెస్ లో చేరుతానన్నారు, కీలక రాజకీయాలు మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉందంటూ కొన్ని ప్రశ్నలను తోసిపుచ్చారు ఆర్కె.

ఇక మొత్తం మీద పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారింది,  కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరొక అప్డేట్ ఇచ్చారు.  ఇక రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల. ఆర్కె కూడా షర్మిల చేరిన తరవాత కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఒకపక్క పెళ్లి పిలుపు మరో పక్క పార్టీ పిలుపు రెండిటిని మనం చూడవచ్చు,  అన్నని తన కుమారుడి పెళ్ళికి ఆహ్వానించడానికి స్వయంగా షర్మిలనే జగన్ ఇంటికి వెళ్లారు, ఈ నేపథ్యంలో ఆర్కె కూడా అక్కడికి రావడంతో పొలిటికల్ గా కూడా అప్డేట్ ఇచ్చారు.

Also Read : AP CM YS Jagan : కేజీ బంగారం బెంజ్ కార్ ఇస్తారన్న.. సీఎం జగన్

Leave A Reply

Your Email Id will not be published!