TSPSC Paper Leak Case: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు !

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు !

TSPSC Paper Leak: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్‌ లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో 7 మంది నిందితులకు షాక్ ఇస్తూ… ఒకేసారి వారందరికీ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న A17, 18, 23, 25, 27, 28, A37 లను వెంటనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

TSPSC Paper Leak Viral

పూర్తి వివరాల్లోకి వెళితే… గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ స్కామ్ లో పోలీసులు ఇప్పటివరకు 50మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఏడుగురు ముద్దాయిలు మాత్రం కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అంతేకాదు వారు నాంపల్లి కోర్టులో గైర్హాజరు పిటిషన్ కూడా వేశారు. నిందితులు వేసిన పిటీషన్ పై సీరియస్ అయిన న్యాయస్థానం… ఆ పిటిషన్ ను తోసిపుచ్చి… ఏడుగురు ముద్దాయిలు కచ్చితంగా హాజరుకావాల్సిందే అంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. వారందరిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : Enforcement Directorate: బెంగాల్‌ సిఎం మమతా పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!