Minister Botsa Satyanarayana: మంత్రి బొత్సాకు అంగన్వాడీల నిరసన సెగ
మంత్రి బొత్సాకు అంగన్వాడీల నిరసన సెగ
Minister Botsa Satyanarayana: ఏపి మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో అంగన్వాడీల నుండి నిరసన సెగ తగిలింది. విజయనగరం జిల్లా గజపతినగరం జాతీయ రహాదరిపై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహాన్ని అంగన్వాడీలు అడ్డగించారు. తమ సమస్యలను పరిష్కరించాలని… పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని మంత్రి బొత్సాను డిమాండ్ చేసారు. చాలీ చాలని జీతాలతో అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీను నెరవేర్చాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను, హెల్పర్లపై ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణమని మండిపడ్డారు. ఎస్మా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకుని.. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడంతో… మంత్రి బొత్స(Minister Botsa Satyanarayana), ఆందోళన కారుల మద్య వాగ్వివాదం జరిగింది. దీనితో ఆందోళన కారులపై మంత్రి బొత్స తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అంతేకాదు మంత్రి-ఆందోళన కారుల మద్య జరుగుతున్న వాగ్వివాదాన్ని చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
Minister Botsa Satyanarayana Comment
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… అంగన్వాడీలకు 11 సమస్యలతో సమ్మె ప్రారంభించారని… ఇప్పటి వరకు పది సమస్యలను పరిష్కరించామన్నారు. అయితే వేతనాలకు సంబంధించిన 11వ సమస్య… పరిష్కరించడం ఇప్పట్లో ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. అయితే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తయినన తరువాత మరల వైసిపి ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందని అప్పుడు అంగన్వాడీలకు సంబంధించిన వేతనాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అయితే బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వివరించినా.. సమ్మె విరమించకపోవడం వల్లే ఎస్మా ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. సమ్మెను విరమించిన మరుక్షణమే ఎస్మా రద్దు చేస్తామని మంత్రి అంగన్వాడీలకు సూచించారు.
Also Read : KTR Lunch at Fan House: అభిమాని ఇంటికి భోజనానికి వెళ్ళిన కేటీఆర్ !