Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు !
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు !
Hyderabad Metro Rail: తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దావోస్ కేంద్రంగా ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సులకు హాజరైన సీఎం రేవంత్… పలు దిగ్గజ కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. తాజాగా హైదరాబాద్ మహానగరం అభివృద్ధితో కీలక పాత్ర పోషించే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీనితో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ఫేజ్-2 రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. సుమారు 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు… ఆ వివరాలను సీఎం రేవంత్ రెడ్డికు అందించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణ గుట్ట క్రాస్ రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు.
Hyderabad Metro Rail – హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 విస్తరణలో ప్రతిపాదించిన మెట్రో మార్గాలు
కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నామా వరకు – (5.5 కి.మీ)
కారిడార్ 2: ఫలక్ నామా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు – (1.5 కి.మీ)
కారిడార్ 4: నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (నాగోల్-ఎల్బీనగర్-చాంద్రాయణ గుట్ట-మైలార్ దేవ్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు) – (29కి.మీ)
కారిడార్ 4: మైలార్ దేవ్ పల్లి నుంచి ప్రతిపాదించిన హైకోర్టు వరకు – (4 కి.మీ)
కారిడార్ 5: రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు (రాయదుర్గం-నానక్‌రామ్‌గూడ-విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు) – (8 కి.మీ)
కారిడార్ 6: మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు (మియాపూర్-పటాన్చెరు-బీహెచ్ఈఎల్-పటాన్చెరు) – (14 కి.మీ)
కారిడార్ 7: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ (ఎల్బీనగర్-వనస్థలిపురం-హయత్‌నగర్) వరకు – (8కి.మీ)
Also Read : AP Final Voter List: ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం !