Ram Mandir: అయోధ్య రామమందిరం దర్శన వేళలు పొడిగింపు !

అయోధ్య రామమందిరం దర్శన వేళలు పొడిగింపు !

అయోధ్య రామమందిరం దర్శన వేళలను పొడిగింపు !

 

బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తరువాత అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తున్నారు. బలరాముడ్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున రామమందిరానికి చేరుకోవడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. దీనితో రామమందిరంలో దర్శన వేళలను ఆలయ అధికారులు పొడిగించారు. ఈ నెల 22న బలరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ అయిన నాటి నుండి రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ దర్శనాలకు అనుమతి ఉండేది. ఇందులో మధ్యలో 2 గంటల పాటు విరామం ఇచ్చేవారు.

అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే బాల రాముడి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. అంతేకాదు రాత్రి 10 గంటల వరకూ పూజలు, దర్శనాలకు అనుమతించాలని ట్రస్టు నిర్ణయించింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు హారతి, భోగ్‌ కోసం 15 నిమిషాలు మాత్రం భక్తుల దర్శనాలు నిలిపివేస్తారు. మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో వాహనాల రాకపోకలను నియంత్రించడంలో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారులను మూసివేశారు. ఆలయం వెలుపల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వు ఫోర్స్‌ బలగాలను మోహరించడం ద్వారా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

100 మంది కళాకారులతో 45 రోజుల పాటు బాల రాముడికి ‘రాగ సేవ’

 

అయోధ్య రామమందిరంలో బాల రాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఈక్రమంలోనే ఆలయంలో శ్రీరాముడికి అంకితమిస్తూ… 45 రోజుల పాటు భక్తి సంగీత ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు వెల్లడించారు. 100 మందికి పైగా కళాకారులు ఈ వేడుకలో పాల్గొని ‘శ్రీరామ రాగ సేవ’ అందించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు కొనసాగుతుందన్నారు. ‘‘శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు… రాముడి పాదాల చెంత ‘రాగ సేవ’ అందిస్తారు’’ అని ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. హేమామాలిని, అనూప్ జలోటా, అనురాధ పౌడ్వాల్, మాలిని అవస్థీ, సోనాల్ మాన్‌సింగ్, సురేశ్‌ వాడ్కర్, పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!