CM YS Jagan: అభ్యర్థుల ఎంపిక పూర్తయింది – సీఎం జగన్
అభ్యర్థుల ఎంపిక పూర్తయింది - సీఎం జగన్
CM YS Jagan: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. కాబట్టి మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నది జ్ఞాపకం పెట్టుకుని పార్టీ క్యాడర్ పనిచేయాలని ఆయన సూచించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన వైసీపీ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అమలుచేయాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసారు.
CM YS Jagan Comment
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ‘‘శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారైనట్లే. ఉంటే చాలా స్వల్ప మార్పులు ఉండవచ్చు. మార్చాల్సినవి 99శాతం ఇప్పటికే మార్చాం. ఇక పెద్ద మార్పులేవీ ఉండవు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయండి. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించండి. పార్టీ నేతలు, కార్యకర్తలు… ప్రతి కుటుంబాన్ని ఐదారుసార్లు కలవాలి. సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టివ్‌గా ఉండాలి. జగన్ వస్తేనే మళ్ళీ పథకాలు కొనసాగుతాయని, మంచి జరుగుతుందని చెప్పాలని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎంతమంది కలిసొచ్చినా.. మనం చేసిన మంచి మనకు కలిసొస్తుందని’’ అని సీఎం జగన్(CM YS Jagan) అన్నారు. తాను చేయాల్సింది చేశానని, మిగిలిందంతా మీ చేతుల్లోనే ఉందని నేతలకు దిశానిర్దేశం చేశారు.
గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను నియమిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఏడు జాబితాలను విడుదల చేసింది. అయిటే రెండు రోజుల క్రితం వారంతా సమన్వయకర్తలేనని… అభ్యర్ధులు కారని… రాజ్యసభ సభ్యులు, వైసీపీ ఉత్తరాంధ్రా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనితో సమన్వయ కర్తలంతా డైలమాలో పడ్డారు. అయితే సీఎం జగన్ తాజా ప్రకటనలో… ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టినవారే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చినట్లైంది.
Also Read : Kadapa Leaders: వైసీపీ నేతలకు గన్మెన్ల తొలగింపు !