Nara Chandrababu Naidu: టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ !
టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ !
Nara Chandrababu Naidu: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీకు షాక్ మీద షాక్ తగులుతోంది. వైసీపీకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీకు రాజీనామా చేసిన వీరు…. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… శనివారం ఉదయం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లి అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ కు… చంద్రబాబు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వసంత కృష్ణప్రసాద్ తో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
Nara Chandrababu Naidu Comment
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ‘‘సంక్షేమం… అభివృద్ధి… ఈ రెండింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సత్తా చంద్రబాబుకే ఉంది. ఏపీ ప్రగతి మార్గంలో ముందుకు వెళ్లాలి.. పరిశ్రమలు రావాలి.. యువతకు ఉద్యోగాలు రావాలి.. ఇవన్నీ తెదేపా అధినేత వల్లే సాధ్యం అవుతుంది. అందుకే పార్టీలో చేరాను. మైలవరం నియోజకవర్గంలో గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో వైకాపా ఎమ్మెల్యేగా పార్టీ నిర్మాణం, అభివృద్ధికి ఎంతో కృషి చేశా. కానీ పార్టీలో ప్రాధాన్యత లభించలేదు. నేను ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వినతులు ఇచ్చా. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
Nara Chandrababu Naidu – నెల్లూరు జిల్లాలో వైసీపీకు భారీ షాక్ !
ఎన్నికల ముందు అధికార పార్టీ వైసీపీకి జిల్లాలో భారీ షాక్ తగిలింది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు టీడీపీలో భారీగా చేరారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్, మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : Chegondi Harirama Jogaiah: కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు !