Amit Shah : సిఏఏ అంశంపై ఎవరికి భయపడబోమని ఘాటు వ్యాఖ్యలు చేసిన షా
మన రాజ్యాంగం ప్రకారం, పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉంది
Amit Shah : దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టం అమలులోకి రానివ్వబోమని ప్రకటించారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. దీని అమలును తిరస్కరించే హక్కు వారికి ఉందా అని హోంమంత్రి షా ప్రశ్నించారు.
Amit Shah Comment Viral
మన రాజ్యాంగం ప్రకారం, పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉంది. చట్టాన్ని అమలు చేసే అధికారం కేంద్రానికి ఉందని, రాష్ట్రాలకు కాదని అన్నారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్ పూర్తి అధికారం ఇస్తుంది. ఎన్నికల తర్వాత అందరూ కలిసి పని చేస్తారనే నమ్మకం ఉందన్నారు.
Also Read : AP High Court: 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు !