RGV Participate : ఏపీలో ఎన్నికల బరిలో దిగనున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

అయితే ఆర్జీవీ పవన్ పై సెటైరికల్ గా ట్వీట్ చేశాడా?

RGV Participate : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి బాంబ్ పేలుస్తాడో చెప్పడం కష్టం. ఇటీవల ‘వ్యూహం’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు వర్మ. ఇప్పుడు శపదం అనే సినిమాని తీసుకురాబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

RGV Participate in AP Elections

“ఆకస్మిక నిర్ణయం. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడం ఆనందంగా ఉందని” ఆర్జీవీ(RGVRGV ) ట్వీట్ చేశారు. అయితే ఆర్జీవీ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం ప్రకటించారు.

అయితే ఆర్జీవీ పవన్ పై సెటైరికల్ గా ట్వీట్ చేశాడా? లేక ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పవన్ తో పోటీ చేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడం వల్ల వర్మ సంతోషిస్తాడా? ఈ ట్వీట్‌కి అసలు అర్థం ఏమిటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Also Read : Eatala Rajender : మోదీ వల్లే ప్రపంచ దేశాలు భారత్ ను గుర్తిస్తున్నాయి

Leave A Reply

Your Email Id will not be published!