Anuradha Paudwal: బీజేపీలో చేరిన ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధ !
బీజేపీలో చేరిన ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధ !
Anuradha Paudwal: ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్… శనివారం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. 2016లో సూర్యోదయ్ ఫౌండేషన్ ను స్థాపించి… పేద ప్రజలకు వైద్యసదుపాయాలు అందిస్తున్న అనురాధ… పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంతో గాఢమైన అనుబంధం ఉన్న ప్రభుత్వంలో చేరడం సంతోషంగా ఉందని… బీజేపీలో చేరడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. అయితే రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేసారు. పార్టీలోనికి అన్ కండీషనల్ గానే వచ్చానన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం అనురాధ బీజేపీలో చేరడం ఆశక్తికరంగా మారింది.
Anuradha Paudwal Joined in BJP
1954లో కర్ణాటకలోని కార్వార్‌లో జన్మించిన అనురాధ(Anuradha Paudwal)… 1973లో 19 సంవత్సరాల వయసులో అమితాబ్ బచ్చన్, జయప్రద నటించిన అభిమాన్ చిత్రంతో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ‘ఆషికీ’, ‘దిల్ హై కీ మంత నహీ’, బేటా చిత్రాలకు ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీ, పంజాబీ, భోజ్‌పురి, నేపాలీ భాషలతో సహా 9,000 పాటలు, 1,500లకు పైగా భజనలను ఆమె స్వరపరిచారు. 2016లో అనురాధ సూర్యోదయ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దీనిద్వారా ఆమె పేద ప్రజలకు వైద్యసదుపాయాలు అందిస్తున్నారు. దీనితో అనురాధ చేసిన కృషికి గుర్తింపుగా 2011లో మదర్ థెరిసా అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు ఆమెను వరించాయి.
Also Read : MLA Lasya Nanditha: కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో లాస్య నందిత సోదరి నివేదిత !