Suneetha Narreddy: ‘వివేకం’ సినిమా కంటే రియాలిటీ ఇంకా ఘోరం – సునీత
‘వివేకం’ సినిమా కంటే రియాలిటీ ఇంకా ఘోరం - సునీత
Suneetha Narreddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని… దాని నుంచి బయటకు రావాలని మాజీ మంత్రి, దివంగత నేత వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) కుమార్తె నర్రెడ్డి సునీత అన్నారు. తన తండ్రిని చంపిన హంతకులను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాపాడటం దారుణమన్నారు. ఇప్పటికైనా వివేకానంద రెడ్డిని హత్య చేసిన హంతకులకు శిక్ష పడేలా ప్రభుత్వం సహకరించాలని అభ్యర్ధించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన ‘వివేకం’ సినిమాపై ఆమె స్పందించారు.
Suneetha Narreddy Comment
‘‘ ‘వివేకం’ సినిమాను డాక్యుమెంటరీ అనాలో… సినిమా అనాలో తెలియడం లేదు. ఎవరో కానీ… చాలా ధైర్యంగా తీశారు. అందులో కొన్ని వ్యక్తిగత అంశాల్లో తేడా ఉండొచ్చు. చివరి అరగంట చూస్తే నాకు భయమేసింది. ఆ సమయంలో కళ్లు మూసుకున్నా. రియాలిటీని తలచుకుంటే మాత్రం ‘వివేకం’ సినిమాను చాలా లైట్ గా తీశారు. రియాలిటీ ఇంకా ఘోరంగా ఉంది. గత ఎన్నికల్లో వివేకా హత్యను రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నేనెప్పుడు రాజకీయాల్లో లేను. తప్పు జరుగుతోంది కాబట్టే బయటకి వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నా. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యక్తిగతంగా నాతో పాటు ఈ రాష్ట్రానికీ మంచిది కాదు’’ అని సునీత అన్నారు.
Also Read : Assam Chief Secretary: అస్సాం చీఫ్ సెక్రటరీగా తెలుగు ఐఏఎస్ అధికారి !