MLC Kavitha: కవితకు వార్నింగ్ ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా !
కవితకు వార్నింగ్ ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా !
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడటంపై జడ్జి సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాదు ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చారు.
MLC Kavitha Case..
ఢిల్లీ లిక్కర్ స్కాం లో మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అరెస్ట్ అయ్యారు. అయితే ఈడీ కష్టడీ అనంతరం తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న కవితను సీబీఐ అధికారులు మరోసారి అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో మూడు రోజుల కస్టడీకు తీసుకున్నారు. కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపిస్తూ… సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించలేదని వెల్లడించింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా… కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది.
అనంతరం, కవిత బయటకు వస్తూ సీబీఐపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కవిత.. ‘‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే… లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు.. ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావులు నిన్న(ఆదివారం) కవితతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ఇక, రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16న విచారణ జరగనుంది.
Also Read : CM Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన సీపీ క్రాంతి రాణా !