Nominations Scrutiny: ముగిసిన నామినేషన్ల పరిశీలన ! గుంటూరు లోక్సభకు అత్యధిక నామినేషన్లు !
ముగిసిన నామినేషన్ల పరిశీలన ! గుంటూరు లోక్సభకు అత్యధిక నామినేషన్లు !
Nominations Scrutiny: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా 16 దాఖలయ్యాయి.
Nominations Scrutiny…
ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే… రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటీలో 2,705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది.
Also Read : Ujjwal Nikam: ‘లోక్సభ’ బరిలో ముంబై బాంబు పేలుళ్ళు కేసు లాయర్ ఉజ్వల్ నికమ్ !