YS Sharmila:నవ సందేహాలు పేరుతో సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ !
నవ సందేహాలు పేరుతో సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ !
YS Sharmila:సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు దగ్గరపడుతుండటంతో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… అధికార వైసీపీపై దూకుడు పెంచారు. ఒకవైపు వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో జగన్ తో పాటు కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్ ను ఇరుకున పెడుతూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం జగన్ ను ఎండగడుతున్నారు. దీనితో భాగంగా బుధవారం సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు.
YS Sharmila:
ఈ బహిరంగ లేఖ ద్వారా నవ సందేహాలకు సమాధానం చెప్పాలని ఆమె సీఎం జగన్ ను కోరారు. ‘‘ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపేశారు?ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు? ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా? డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?’’ అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.
Also Read :-Rahul Gandhi: ప్రజ్వల్ రేవణ్ణపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు !