Narendra Modi: ఈ నెల 14న ప్రధాని మోదీ నామినేషన్ ?
ఈ నెల 14న ప్రధాని మోదీ నామినేషన్ ?
Narendra Modi: దేశంలో సార్వత్రిక ఎన్నికలు దాదాపు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. మొత్త ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా…. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఐదు, ఆరవ దశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది.
Narendra Modi Nomination
ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మే 14న వారణాసిలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందించనున్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముహూర్తాన్ని అందించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తాజాగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మే 14న గంగా సప్తమి. ఆరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆ రోజున నామినేషన్ దాఖలు చేయడం శ్రేయస్కరమని పండితులు ప్రధాని మోదీకి సూచించారు. గంగా సప్తమి రోజున బ్రహ్మదేవుని కమండలంలో నుంచి గంగ జన్మించిందని చెబుతారు. ప్రస్తుతం మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం మే 13న ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ మరుసటి అంటే మే 14న ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు మోదీ గంగామాతకు పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలను సంబంధించిన షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
Also Read : Air India : సిక్ లీవ్ అనంతరం విధుల్లో చేరిన ఎయిర్ ఇండియా సిబ్బంది