Special Investigation Team: రంగంలోనికి దిగిన సిట్ బృందం ! తిరుపతి చేరుకున్న సిట్ అధికారులు !
రంగంలోనికి దిగిన సిట్ బృందం ! తిరుపతి చేరుకున్న సిట్ అధికారులు !
Special Investigation Team: ఏపీలో పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమీషన్ కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సమగ్ర విచారణకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిన్ ఏర్పాటు చేసింది. దీనితో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పునఃసమీక్షించనుంది. అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైనా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
Special Investigation Team – పల్నాడు జిల్లాలో అల్లర్లపై సిట్ ఆరా !
పల్నాడు(Palnadu) జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మేరకు పల్నాడు జిల్లాలో శనివారం సిట్ బృందం పర్యటిచింది. అలాగే నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై ఆరా తీస్తోంది. టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసులకు కారణమైన వారిపై సిట్ బృందం వివరాలు అడిగి తెలుసుకుంటుంది. టీడీపీ- వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తుంది. ఆయా పోలీస్ స్టేషన్లలో నుంచి సిట్ బృందం విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
Also Read : CM YS Jagan: లండన్ చేరుకున్న సీఎం జగన్ !