Rahul Gandhi: ఏపీ, తెలంగాణ భవన్‌ లలో రాహుల్‌ గాంధీ సందడి !

ఏపీ, తెలంగాణ భవన్‌ లలో రాహుల్‌ గాంధీ సందడి !

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ లలో సందడి చేశారు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరిరోజున బిజీబిజీగా ఉన్న రాహుల్‌ మధ్యాహ్న భోజనం చేసేందుకు ఏపీ, తెలంగాణ భనన్‌ లకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ స్థానిక నేతలతో కలిసి మెస్‌ లో భోజనం చేశారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగారు. అభిమానంతో ఇచ్చిన మామిడి పండ్లను సంతోషంగా స్వీకరించారు. అనంతరం మీడియాతో రాహుల్‌(Rahul Gandhi) మాట్లాడుతూ… జూన్‌ 4 తర్వాత ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని 90 కోట్ల పేద వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నికల్లో తమ వెంటే ఉన్నారన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు ఎంపీ సీట్లు ఇండియా కూటమే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవిని వెంటపెట్టుకుని కన్నాట్‌ ప్లేస్‌ లో ఒక ఐస్‌క్రీం పార్లర్‌కు వెళ్లారు. మల్లు రవికి ఐస్‌ క్రీం తినిపించారు.

Rahul Gandhi – మోదీని మానసిక వైద్యుడికి చూపించాలి – రాహుల్

తాను సత్కారణంతో దేవుని సాధనంగా భూమిపైకి వచ్చానంటున్న ప్రధాని మోదీని మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని రాహుల్‌ గాంధీ అన్నారు. మహిళలు రెండో తరగతి పౌరులని బీజేపీ నమ్ముతోందని… ఆ పార్టీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్ఎస్‌ తన శాఖల్లోకి మహిళలను అనుమతించదని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన పలు సమావేశాల్లోనూ, మెట్రో రైలులో ప్రయాణికులతోనూ ఆయన మాట్లాడారు. ‘‘కరోనా కాలంలో ప్రజలు గంగాతీరంలో చనిపోయారు. వేలాదిమంది ఆస్పత్రుల ముందు కన్నుమూశారు. మరి భగవంతుడు పంపిన మోదీ ఆ సమయంలో ఏం చేశారు?’’ అని రాహుల్‌ ప్రశ్నించారు.

Also Read : Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలు సమయంలో స్వల్ప మార్పు !

Leave A Reply

Your Email Id will not be published!