Medha Patkar: పరువు నష్టం కేసులో దోషిగా మేధాపాట్కర్‌ !

పరువు నష్టం కేసులో దోషిగా మేధాపాట్కర్‌ !

Medha Patkar: ప్రముఖ సామాజిక వేత్త, నర్మదా బచావో ఆందోళన్‌(ఎన్‌బీఏ) నాయకురాలు మేధాపాట్కర్‌ ను పరువు నష్టం కేసులో దోషిగా తేలారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా 23 సంవత్సరాల క్రితం దాఖలుచేసిన పరువు నష్టం కేసులో ఆమె దోషిగా తేలారు. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ శుక్రవారం తీర్పు వెలువరించారు. చట్ట ప్రకారం ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.

Medha Patkar..

తన పరువుకు భంగం కలిగేలా పత్రికా ప్రకటన విడుదల చేశారంటూ 2000 సంవత్సరంలో మేధాపాట్కర్‌(Medha Patkar) పై వీకే సక్సేనా కేసు దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (ఎన్‌సీసీఎల్‌) అనే ఎన్జీవోకు అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటి నుంచి వారి మధ్య న్యాయ వివాదం కొనసాగుతోంది. సుమారు 23 ఏళ్ళ పాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించారు. అయితే ఈ తీర్పులోని పూర్తి అంశాలు… ఇంకా బయటకు రావాల్సి ఉంది.

Also Read : Kedarnath: గింగరాలు తిరిగిన హెలికాప్టర్‌ ! కేదార్ నాథ్ లో తప్పిన పెను ప్రమాదం !

Leave A Reply

Your Email Id will not be published!