Indian Army: ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు !
ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు !
Indian Army: త్రివిద దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీ(Indian Army) చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీనితో జూన్ 30 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. జనరల్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపుకు క్యాబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపినట్లు వివరించింది. జనరల్ మనోజ్ పాండే… 2022 ఏప్రిల్ 30న సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ పొందాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు ఆయన పదవీ కాలం పొడిగించడంతో… ఆయన జూన్ 30 వరకు పదవిలో కొనసాగుతారు.
Indian Army Chief..
ఇది ఇలా ఉండగా త్రివిద దళాల్లో ఉన్నతాధికారుల పొడిగింపు చాలా అరుదు. సైన్యాధిపతి సర్వీసును ప్రభుత్వం పొడిగించిన ఘటన 1970ల ఆరంభంలో జరిగింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ జి.జి.బెవూర్కు ఏడాది పాటు పొడిగింపు దక్కింది. దీనివలన అతని తరువాత స్థానంలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్ భగత్ సైన్యాధిపతి పదవిని చేపట్టకుండానే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. సీనియార్టీ ప్రకారం చూస్తే ప్రస్తుతం మనోజ్ పాండే తర్వాతి స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఎం.వి.సుచీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన సైనిక ఉపప్రధానాధికారిగా పనిచేస్తున్నారు. మరోవైపు పాండే పదవీకాలాన్ని పొడిగించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సైనిక దళాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.
Also Read : CM Revanth Reddy: కీరవాణితో సీఎం రేవంత్ భేటీ ! రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై చర్చ !