Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం – ఎంపీ సి.ఎం.రమేశ్
ఆంధ్రా యూనివర్సిటీ అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం - ఎంపీ సి.ఎం.రమేశ్
Andhra University: ఏపీలో ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ(Andhra University) వీసీగా ప్రసాద్ రెడ్డి రాజీనామా చేయడంపై.. వర్సిటీలో విద్యార్ధులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ఐదేళ్ళుగా వైసీపీతో అంటకాగిన ప్రసాద్ రెడ్డి… ఆంధ్రా యూనివర్సిటీను వైసీపీ కార్యాలయంలా మార్చేసారని.. ఎట్టకేలకు వర్సిటీకు విముక్తి కలిగిందంటూ విద్యార్ధులు కేక్ కట్ చేసి, యూనివర్సిటీ యాంబ్లమ్ కు పాలాభిషేకం నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సిఎం రమేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరుడు యూనివర్శిటీకు వెళ్ళారు. ఈ సందర్భంగా నాయకులకు ఆంధ్రా వర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు.
Andhra University…
ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సిఎం రమేశ్ మాట్లాడుతూ… ఆంధ్రా విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామన్నారు. అవినీతిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏయూలో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పాలకవర్గం ఉంటుందని హామీ ఇచ్చారు. ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని, నియామకాలు చేశారని ఆరోపించారు. ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.
Also Read : Mahesh Chandra Ladha: ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్‌చంద్ర లడ్హా ?