Kurian Committee : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేస్తున్న కురియన్ కమిటీ
కమిషన్ నివేదికను సీల్డ్ కవరులో ఏఐసీసీకి అందజేస్తామని కురియన్ కమిటీ స్పష్టం చేసింది...
Kurian Committee : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంపై ఆ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకుంది. ఇప్పటికే గాంధీ భవన్ నుంచి పిలుపు రావడంతో 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు తరలివచ్చారు. కురియన్ కమిటి వివాదాస్పద అభ్యర్థులతో వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. కమిటీ ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాల సమయం కేటాయించింది.
Kurian Committee Visit
కమిషన్ నివేదికను సీల్డ్ కవరులో ఏఐసీసీకి అందజేస్తామని కురియన్ కమిటీ స్పష్టం చేసింది. టిక్కెట్లు రాని క్యాడర్ కూడా కురియన్ కమిటీకి తమ వాదన వినిపించేందుకు సిద్ధమయ్యారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అపజయంపై ఏఐసీపీ విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విచారణ కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ కమిటీలో కురియన్‌తో పాటు రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కురియన్ కమిటీ రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండి పలు నియోజకవర్గాల్లో పర్యటించనుంది.
Also Read : Minister Durgesh : త్వరలో నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తాం..