Minister Nitin Gadkari : ఏపీలో జాతీయ రహదారులపై కీలక సమీక్ష ఏర్పాటు చేసిన గడ్కరీ

అనంతరం ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులు..

Nitin Gadkari : రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే తదితరులు ఆయనకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులు, రాష్ట్ర రహదారుల పరిస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

Nitin Gadkari Visit

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని ఏపీలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్‌) సహా కీలక ప్రాజెక్టులపై రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి, అధికారులతో కేంద్ర మంత్రి మాట్లాడినట్లు సమాచారం. అలాగే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటు సహా రాష్ట్రంలోని రోడ్లు, రహదారుల పరిస్థితిపై కేంద్ర మంత్రి అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. సమీక్ష అనంతరం మదనపల్లెలో శ్రీ ఎం నెలకొల్పిన సత్సంగ్ ఫౌండేషన్‌కు నితిన్ గడ్కరీ(Nitin Gadkari) హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఇవాళ(బుధవారం) రాత్రి తిరుమల చేరుకుని, గురువారం ఉదయం ప్రాతఃకాల సమయంలో స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన తిరుగు ప్రయాణం చేయనున్నారు.

Also Read : PM Narendra Modi : సైబర్ నేరాలపై డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా వహించాలి

Leave A Reply

Your Email Id will not be published!