Balalatha : ఐఏఎస్ స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై ఘాటుగా రిప్లై ఇచ్చిన బాలలత

అంగవైకల్యం ఉన్న జై పాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటరీ సాధించారని తెలిపారు...

Balalatha : సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్మిత వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా… ప్రముఖ మోటివేటర్, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకురాలు బాలలత(Balalatha) స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మిత సబర్వాల్‌కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మిత సబర్వాల్(Smita Sabharwal) ఎంతకాలం పనిచేశారని నిలదీశారు. వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత సబర్వాల్ మాటలు మరింత కుంగదీశాయన్నారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మొదట అపాయింట్‌మెంట్ వికలాంగురాలికి ఇచ్చారని గుర్తు చేశారు. స్మిత తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? లేక ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారా అనేది తెల్చాలన్నారు.

Balalatha Comment

కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వేంట్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మిత సబర్వాల్‌పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగవైకల్యం ఉన్న జై పాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటరీ సాధించారని తెలిపారు. స్మిత సబర్వాల్‌పైన చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ‘‘ ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధించమని స్మిత సబర్వాల్‌’’ సవాల్ విసిరారు. స్టీఫిన్ హాకింగ్, సుదా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారన్నారు. కేసీఆర్‌ హయాంలో పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్‌పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారమన్నారు. అంగవైకల్యంతో పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులు తీసుకున్నవారు ఉన్నారన్నారు. 24 గంటల్లో స్మిత సభర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం ఈ అంశంపైన స్పందించకపోతే టాంక్ బండ్‌పైన నిరసన తెలియజేస్తామని బాలలత స్పష్టం చేశారు.

‘‘ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వీసు ఉద్యోగాలకు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది.. ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుంది.. ఇందుకు శారీరక దృఢత్వం, అవసరం.. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుంది.. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నాను… కానీ వైకల్యం ఉన్న ఫైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్‌ సేవలను మీరు విశ్వసిస్తారా?’’ అంటూ ఐఏఎస్ అధికారిని స్మితసబర్వాల్ ట్వీట్ చేశారు. అయితే దివ్యాంగులపై స్మిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : YS Sharmila : వినుకొండ మర్డర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!