Ex Minister Yanamala : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయింపుపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

కేంద్ర బడ్జెట్ కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్నారు...

Ex Minister Yanamala : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్టులో పోందుపర్చడం సంతోషంగా ఉందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తొడ్పడుతుందన్నారు. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కేంద్రం ప్రకటనలు ఆర్థిక తొడ్పాటు ఇస్తుందని తెలిపారు. ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.

Ex Minister Yanamala Comment

కేంద్ర బడ్జెట్ కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్నారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు పడడానికి కేంద్ర బడ్జెట్ ఉపకరిస్తుందయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలించాయన్నారు. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతఙతలు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు ఊతమిస్తాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Also Read : Union Budget 2024 : వ్యవసాయం అనుబంధ రంగాలకు పెద్దపీట వేసిన కేంద్ర బడ్జెట్

Leave A Reply

Your Email Id will not be published!