Tirumala Issues : శాసనమండలిలో తిరుమలలో జరిగే అఘాయిత్యాలపై చర్చ..
అలాగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తర కార్యక్రమం జరుగుతోంది...
Tirumala : ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా తిరుమల అవినీతిపై చర్చ ప్రారంభమైంది. పరకామణిలో భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే రామగోపాల్ రెడ్డి ఆరోపించారు. రవికుమార్ అనే ఉద్యోగి రూ. 100 కోట్లు యూఎస్ డాలర్లు పక్కదారి పట్టించారని ఎమ్మెల్యే విమర్శించారు. కేసును కూడా తారుమారు చేశారని , తిరుమలలో జరిగిన అవివీతిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Tirumala Issues
గతంలో ఎన్నడూలేని స్థాయిలో తిరుమలను భ్రష్టుపట్టించారని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) విమర్శించారు. తిరుమలలో అనేక మాఫీయాలు తయారయ్యాయని, శ్రీ వాణి ట్రస్ట్ నిధులపై విచారణ చేస్తామని మంత్రి ఆనం అన్నారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించామని, త్వరలోనే తిరుమలను గాడిలో పెడతామని మంత్రి ఆనం సమాధానం ఇచ్చారు. బ్రేక్ దర్శనంకు వారానికి ఆరు రోజుల లేఖలకు అనుమతి ఇవ్వాలని సభ్యులు కోరారు. ఎమ్మెల్యేలతో సమానంగా ఎమ్మెల్సీలకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు.
అలాగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తర కార్యక్రమం జరుగుతోంది. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆగస్టు 31లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నారు. రిపోర్ట్ వచ్చిన తరువాత సభ్యులు కోరిన విధంగా సీఎం ఆదేశాలు తీసుకుని సీబీఐ విచారణకు సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీనిపై అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి లోకేష్ ఒక విచారణ కమిటీ నియమించారన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారని మంత్రి పయ్యావుల వెల్లడించారు.
Also Read : Ex Minister Yanamala : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయింపుపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు