Kamareddy MLA : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే బాధాకరం

తెలంగాణ శాసనసభలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఎంతో బాధ కలిగిస్తోందన్నారు...

Kamareddy MLA : అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. ఒకరిని ఒకరు లోపల తిట్టుకుని.. బయట కలిసి తిరుగుతున్నారన్నారు. తాను జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా పనిచేశానని.. సభలో ఎలా ఉండాలో తనకు తెలుసన్నారు. గతంలో అసెంబ్లీ మీదుగా వెళ్లేటప్పుడు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్తామా అని అనుకునేవాడినన్నారు. చట్టసభలకు వచ్చే ఎమ్మెల్యేలు ప్రజలకు మంచి చేస్తారని భావించేవాడినని వెంకటరమణారెడ్డి తెలిపారు. జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలుమ అసెంబ్లీ రావడంలేదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇద్దరు నాయకులు మాట్లాడితే మిగతా 60 మంది భజన చేస్తున్నారని.. అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నేతలే లేరని వెంకటరమణారెడ్డి(K V Ramana Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుడికి నిబద్ధత ఎంతో అవసరమన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాలనే కనీస ఆలోచన, అవగాహన ఏ నేతలకు లేదన్నారు. ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని తనకు బాధగా ఉందన్నారు.

Kamareddy MLA Comment

తెలంగాణ శాసనసభలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. ప్రజల ఘోష నేతలకు వినపడటం లేదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(K V Ramana Reddy) పేర్కొన్నారు. తాను సత్యహరిచంద్రుడిని కాదని అన్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఏమి బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం గత 9 ఏళ్లలో తెలంగాణకు ఏమి ఇచ్చిందో జీవోలతో సహా చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత కేసీఆర్ హయాంలో బీఆర్‌ఎస్‌కు 12 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు తీసుకొచ్చారో కేటీఆర్ వెల్లడించాలన్నారు. సభలో ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుని.. తర్వాత మిత్రులుగా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు అంతా మిత్రులు అయితే.. ప్రజలే శత్రువులా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి చేతకాక రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని.. ఇప్పుడున్న సీఎం ఏం చేస్తున్నారని వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న తీరుపై ప్రధానంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చకు పెట్టడం.. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు.. బీజేపీపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : AP Assembly : టీడీఆర్ బాండ్ల వ్యవహారం ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ

Leave A Reply

Your Email Id will not be published!