Telangana Budget: రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క !

రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క !

Telangana Budget: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

తెలంగాణ బడ్జెట్‌(Telangana Budget)లో వ్యవసాయ రంగానికే సింహభాగం రూ.72,659 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇది రైతుల తలరాతలు మార్చే చరిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి అని తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘రైతు భరోసా సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతాం. బడ్జెట్‌ కేవలం అంకెల సమాహారం కాదు. విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. అసమానతలు లేని సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు రూ.12వేలు అందించే బృహత్తర కార్యక్రమం చేపడతాం.

Telangana Budget – హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు !

విశ్వనగరంగా హైదరాబాద్‌ ను తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి భారీగా రూ.10వేల కోట్లు కేటాయించారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు రూ.1500 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు, పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, మెట్రో వాటర్‌ వర్క్స్‌ రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు.

 

రాష్ట్ర బడ్జెట్‌ లో కీలక అంశాలు !

ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు
ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు
వ్యవసాయానికి రూ.72,659 కోట్లు
ఉద్యానశాఖకు రూ.737కోట్లు
పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723కోట్లు
గృహజ్యోతికి రూ.2,418కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు
రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు రూ.1,525 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.17,056కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.3,003కోట్లు
బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు
వైద్య, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు
అడవులు, పర్యావరణం రూ.1,064 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,762 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు
విద్యకు రూ.21,292 కోట్లు
హోంశాఖకు రూ.9,564కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు

Also Read : Vikas Dwivedi: ఎనిమిదోసారి కూడా వికాస్‌ ను కాటేసిన నాగుపాము !

Leave A Reply

Your Email Id will not be published!